Sat Dec 13 2025 19:19:28 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికే ఏలూరు కాల్వలోకి కారును తోసేసి?
ఏలూరు కాల్వలో కారు దూసుకెళ్లిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఏలూరు కాల్వలో కారు దూసుకెళ్లిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు ఏలూరు కాల్వలో పడిందని పోలీసులు తొలుత భావించారు. కానీ కారును ఏలూరు కాల్వలోకి తోసేసి తాను క్షేమంగా బంధువులు ఇంటికి వెళ్లి తలదాచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. కారును డ్రైవ్ చేస్తున్న రాజేష్ అనే యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
క్షేమంగా రాజేష్....
అయితే రాజేష్ మారేడుమిల్లిలోని బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. రాజేష్ కారును ఏలూరు కాల్వలో తోసేసి పెద్ద డ్రామా ఆడారని చెబుతున్నారు. తాను మరణించినట్లు నమ్మించడానికే కారును కాల్వలోకి తోసేశాడంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చేసిన అప్పుల నుంచి బయటపడటానికే ఈ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలియవచ్చింది.
Next Story

